Saturday, May 30, 2026
Home Blog

కాలువలు కబ్జా… అధికారుల కళ్లముందే ప్రకృతి నాశనం!

  • రామేశ్వరం బండలో వెంచర్ల రాజ్యం

ఇరిగేషన్ శాఖ నిద్రలో… ప్రజలు ముంపులో!

ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో వెంచర్ల దందా బహిరంగంగా కొనసాగుతోంది. సహజ కాలువలు, కల్వర్టులను నిర్దాక్షిణ్యంగా మూసివేస్తూ రోడ్లు వేస్తున్నా అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.గ్రామంలో పలు కీలక నీటి మార్గాలను మట్టితో నింపి పూర్తిగా బ్లాక్ చేయడంతో వర్షాకాలంలో నీరు ఎక్కడికక్కడ నిల్వై ముంపు పరిస్థితులు ఏర్పడిే అవకాశాలున్నాయి. రైతుల పంటలు నాశనం కావడమే కాకుండా, ఇళ్లలోకి నీరు చేరే పరిస్థితి నెలకొంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అంతా జరుగుతున్నా కాలువల పరిరక్షణ బాధ్యత వహించే ఇరిగేషన్ శాఖ మాత్రం నిద్రలోనే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మౌనం వెనుక వారి లాభ ఎంతో? అధికారులు స్పందించకపోవడం వల్లే వెంచర్ నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తూ, సహజ నీటి ప్రవాహాలను అడ్డుకోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం, భవిష్యత్తులో భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలువలను తక్షణమే పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఐలాపూర్ భూముల్లో హైడ్రాకు ప్రవేశించే హక్కు లేదు: న్యాయవాది ముఖీమ్

ఐలాపూర్ భూముల విషయంలో న్యాయస్థానాల పరిధిలో రిట్ అప్పీల్ పెండింగ్‌లో ఉన్నందున, హైడ్రా అధికారులకు ఆ భూముల్లోకి ప్రవేశించే హక్కు లేదని న్యాయవాది ముఖీమ్ తేలిపారు . బుధవారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలిసి ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల భూములపై కన్నేసిన రేవంత్ సర్కార్, హైడ్రా పేరుతో దోపిడీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తమకు అనుకూలమైన డిక్రీ ఉందని, నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా అధికారులు నిత్యం వాహనాలతో తిరుగుతూ వ్యవసాయం చేసుకుంటున్న రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న భూములపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టడం అమీన్‌పూర్ రెవెన్యూ అధికారుల అతిచర్యేనని ఖండించారు. హైడ్రా అధికారి రంగనాథ్‌తో కలిసి ఒక నూతన సొసైటీ భారీ భూకుంభకోణానికి తెరలేపిందని, త్వరలోనే ఆ గుట్టు రట్టు చేస్తామని హెచ్చరించారు. చట్టబద్ధమైన ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా జోక్యం చేసుకోవడం తగదని, గ్రామస్థులెవరూ భయపడవద్దని, న్యాయస్థానాలు రక్షణ కవచంలా ఉన్నాయని భరోసా ఇచ్చారు.
అనంతరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఐలాపూర్ భూముల విషయంలో హైడ్రా, రెవెన్యూ అధికారులు సంయమనంతో వ్యవహరించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని హితవు పలికారు. హైడ్రా తన పరిధిని మించి వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని, ప్రభుత్వం పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వివాదాస్పదం కాని భూముల జోలికి వెళ్లొద్దని ఎమ్మార్పీఎస్ తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐలాపూర్ రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిరుత దాడిలో లేగదూడ మృతి

కాజిపల్లి అటవీ ప్రాంతంలో కలకలం

సలాం హైదరాబాద్: జిన్నారం మండలం గడ్డపోతారం పురపాలక సంఘం పరిధిలోని కాజిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత మళ్లీ భయాందోళన సృష్టించింది. శుక్రవారం కాజీ చెరువు సమీపంలో మేత మేస్తున్న లేగదూడపై దాడి చేసి చంపింది. చిరుత లేగదూడను చంపుతుండగా సమీపంలో ఉన్న గొర్రెల కాపరి గమనించాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. కాజిపల్లి అటవీ ప్రాంతంలో చాలా రోజులుగా చిరుత సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. మృతి చెందిన లేగదూడ కాజిపల్లి గ్రామానికి చెందిన గద్దె కృష్ణ అనే రైతుదిగా గుర్తించారు.

ఎమ్మెల్యే జీఎంఆర్ ను కలిసిన జిన్నారం పాలకవర్గం

పటాన్ చెరు, మార్చి 03: హోలీ పండుగ సందర్భంగా జిన్నారం మున్సిపల్ చైర్మన్ యాట జనార్ధన్ నేతృత్వంలో పాలకవర్గ సభ్యులు, పార్టీ నాయకులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ కు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి తదితరులు పాలకవర్గం సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జీఎంఆర్ ను కలిసిన జిన్నారం పాలకవర్గం

పటాన్ చెరు, మార్చి 03: హోలీ పండుగ సందర్భంగా జిన్నారం మున్సిపల్ చైర్మన్ యాట జనార్ధన్ నేతృత్వంలో పాలకవర్గ సభ్యులు, పార్టీ నాయకులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ కు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి పాలకవర్గం సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

గుమ్మడిదలలో ఉత్సాహంగా హోలీ వేడుకలు

హాజరైన సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి..

సలాం హైదరాబాద్: గుమ్మడిదల పట్టణంలో హోలీ పండుగను యువత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ప్రధాన వీధులు రంగుల కాంతులతో కళకళలాడాయి. యువకులు పరస్పరం రంగులు చల్లి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. పలుచోట్ల సంగీతంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి వేడుకల్లో పాల్గొని యువతతో కలిసి రంగులు చల్లారు. పండుగలు సామాజిక ఐక్యతకు ప్రతీకలని, స్నేహభావంతో సంబరాలు జరుపుకోవాలని సూచించారు. రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానంద రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షుడు ఆకుల సత్యనారాయణ, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, సూర్యనారాయణ, మహిపాల్ రెడ్డి, చంద్రారెడ్డి, రవీందర్ రెడ్డి, జయపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుంటి మల్లేష్ తదితరులు పాల్గొనారు.

వీరభద్ర స్వామి ఆలయానికి గ్రహణ విరామం..

రేపు ఉదయం నుంచి నిత్య పూజలు ప్రారంభం

సలాం హైదరాబాద్ గుమ్మడిదల :- పురపాలక సంఘం పరిధిలోని బొంతపల్లి వీరన్నగూడెం వార్డులోనీ ప్రసిద్ధ స్వయంభు పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయాన్ని మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం నిత్యకర్మలు పూర్తి చేశారు. తరువాత ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేసి గ్రహణ కాలమంతా భక్తుల దర్శనాలను నిలిపివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి రేపు తెల్లవారుజాము నుంచి యథావిధిగా నిత్య పూజలు, సాధారణ దర్శనాలు కొనసాగనున్నాయి.

శ్రీవివేకానంద స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం

  • ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
  • విద్యా సందేశాలతో మెరిసిన చిన్నారులు
  • హాజరైన ప్రజాప్రతినిధులు..

గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని శ్రీవివేకానంద స్మార్ట్ కిడ్స్ హై స్కూల్ గుమ్మడిదలతో పాటు ఆచార్యాద స్కూల్ అన్నారం విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల చైర్మన్ చిమ్ముల మల్లారెడ్డి, కరస్పాండెంట్ చిమ్ముల జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ చిమ్ముల లతా రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా అలంకరించి ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు.

వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులు దేవలోకంలోని దేవకన్యల వేషధారణలతో నృత్యాలు ప్రదర్శించారు. బుడిబుడి అడుగులతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను మైమరిపించాయి. జానపద నృత్యాలు, దేశభక్తి గీతాలు, సామాజిక అంశాలపై రూపకాలు, ప్రకృతి పరిరక్షణ, జంతు సంరక్షణ వంటి అంశాలపై ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనిమల్ డే సందర్భంగా జంతువుల వేషధారణలో ఇచ్చిన సందేశాత్మక ప్రదర్శన ప్రేక్షకులను ఆలోచింపజేసింది.

విద్యార్థుల విద్యా ప్రగతిని ప్రతిబింబించే సైన్స్ మోడల్స్, ఆంగ్ల ప్రసంగాలు, గణిత నైపుణ్య ప్రదర్శనలు నిర్వహించారు. విద్యతో పాటు సాంస్కృతికాభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది.

కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్యా గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలు పాల్గొన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా రాత్రి క్రికెట్ పోటీలు

గుమ్మడిదల మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జాగారంలో భాగంగా రాత్రి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతాయి. యువ నాయకుడు కర్ణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇవి 8వ వార్షికోత్సవ క్రికెట్ పోటీలని.. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పోటీల్లో పాల్గొనదలచిన జట్లు ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. టోర్నమెంట్ నిర్వహణలో నరేష్, రాజశేఖర్, రాకేష్, రవి, భీకరం దాస్, అంజన్ గౌడ్, సురేశ్, సాయి, హరీష్, ఆశు, జగదీష్, అరవింద్, విజయ్ పాల్గొంటున్నారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని క్రికెట్ పోటీలు

గుమ్మడిదల మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జాగారంలో భాగంగా మండలంలో నేడు సాయంత్రం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు యువ నాయకులు కర్ణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం యువతను ఉత్సాహ పరిచే విధముగా మహాశివరాత్రి రోజు ఈ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇవి 8వ వార్షికోత్సవ క్రికెట్ పోటీలని తెలిపారు. ఇందుకోసం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే జట్లు సాయంత్రం 5 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్లుగా నరేష్, రాజశేఖర్ , రాకేష్, రవి, భీకరం దాస్ ,అంజన్ గౌడ్ , సురేశ్, సాయి, హరీష్, ఆశు, జగదీష్, అరవింద్, విజయ్ వివరిస్తున్నారని యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.