Sunday, December 7, 2025
Home Blog

మైత్రి ఫౌండేషన్ సేవలకు గుర్తింపు

నీలోఫర్ ఆసుపత్రి నుంచి ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం

గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన మైత్రి ఫౌండేషన్ సేవలకు గుర్తింపు లభించింది. నీలోఫర్ ఆసుపత్రిలో తలసేమియా పిల్లలు, గర్భిణీ స్త్రీల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు ఆసుపత్రి సిఎస్ నాగజ్యోతి, సూపరిండెంట్ విజయ్ కుమార్‌లు ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయకుమార్‌కు ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయకుమార్ మాట్లాడుతూ ఈ అవార్డు తమ సేవలకు లభించిన గౌరవమని, మాపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.

లిప్పన్ కళారూపానికి ఆధునికతగీతంలో నెక్సెస్ 2025 పేరిట సృజనాత్మకత, సంస్కృతి, సహకార వేడుక

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బుధవారం నెక్సెస్ 2025 పేరిట సృజనాత్మకత, సంస్కృతి, సహకారం యొక్క ఉత్సాహభరితమైన వేడుకను నిర్వహించి, లిప్పన్ కళ యొక్క కాలాతీత ఆకర్షణను సమకాలీన వెలుగులోకి తీసుకొచ్చింది. శతాబ్దాల నాటి లిప్పన్ కళారూపాన్ని ఆధునిక లెన్స్ ద్వారా తిరిగి ఊహించుకుంటూ, సాంస్కృతిక వారసత్వాన్ని సమకాలీన డిజైన్ సున్నితత్వాలతో మిళితం చేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది కళాశాలలకు చెందిన 55 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, ఒకరికి మరొకరు సహకరించుకోవడంతో పాటు ఇతరులతో పరిచయాలను పెంచుకుని, తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. సాంప్రదాయ చేతిపనుల యొక్క సాధారణ అన్వేషణగా ప్రారంభమై, ఆవిష్కరణ, బృంద కృషి, కళాత్మక వ్యక్తీకరణలతో కూడిన కాన్వాస్ గా పరిణామం చెందింది. స్కెచ్ బుక్ లు సంక్లిష్టమైన నమూనాలతో రోజంతా వికసించాయి. నైపుణ్యం కలిగిన చేతుల కింద గాలికి ఎండిపోయిన బంకమట్టి రూపాంతరం చెంది, చేతిపనులను ప్రతిబింబించాయి. వర్ధమాన వాస్తుశిల్పులు శతాబ్దాల నాటి లిప్పన్ కళారూపాన్ని ఆధునిక మెరుగులద్దారు. నెక్సెస్ లో పాల్గొన్న వారంతా తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం, నేటి నిర్మాణ, కళాత్మక వ్యక్తీకరణలలో సాంప్రదాయ మూలాంశాలు తాజా అర్థాన్ని ఎలా పొందవచ్చో అన్వేషించడంతో వాతావరణమంతా శక్తి, ఊహతో సజీవంగా మారింది. తత్ఫలితంగా, భారతదేశ కళాత్మక వారసత్వాన్ని, యువత ఆవిష్కరణ స్ఫూర్తిని ప్రతిబింబించే సృజనాత్మక ప్రదర్శనగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమాన్ని వీక్షా నోముల (యూనిట్ సెక్రటరీ, మూడో సంవత్సరం), జక్కిడి అద్వయ స్ఫూర్తి (యూనిట్ డిజైనర్, రెండో సంవత్సరం)తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రుతి గావ్లి సమన్వయం చేశారు.

నిరుపేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ 

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఆపద కాలంలో మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన గోనె ఉమారాణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉమారాణి వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రెండు లక్షల 50 వేల రూపాయల విలువైన ఎల్ఓసి మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జీఎంఆర్ ఎల్ఓసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్ఓసి లతోపాటు సీఎంఆర్ చెక్కులు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు కుమార్ గౌడ్, సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మంద బాల్ రెడ్డి పాల్గొన్నారు.

జిన్నారంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వీధుల గుండా రూట్ మార్చ్ చేపట్టారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దేశభక్తి, ఆచార సాంప్రదాయాలతో పాటు సనాతన ధర్మాలను కాపాడుకోవడమే ర్యాలీ ఉద్దేశమని సూచించారు. దాదాపు 200 మంది సభ్యులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రవికుమార్, ఆర్ఎస్ఎస్ సభ్యులు యువకులు పాల్గొన్నారు.

జిన్నారంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ

  • ఉత్సాహంగా పాల్గొన్న సంఘ్ సభ్యులు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వీధుల గుండా రూట్ మార్చ్ చేపట్టారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దేశభక్తి, ఆచార సాంప్రదాయాలతో పాటు సనాతన ధర్మాలను కాపాడుకోవడమే ర్యాలీ ఉద్దేశమని సూచించారు. దాదాపు 200 మంది సభ్యులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రవికుమార్, ఆర్ఎస్ఎస్ సభ్యులు యువకులు పాల్గొన్నారు.

ఉత్తమ అవార్డు అందుకున్న మహిళా యాంకర్‌కు సన్మానం

గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన చంద్రిక యుగంధర్ ప్రముఖ టీవీ ఛానల్‌లో న్యూస్ రీడర్ (యాంకర్)గా విశిష్టమైన సేవలు అందించి, హైదరాబాద్‌లోని త్యాగరాయ జ్ఞానసభలో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని విశిష్ట ప్రతిభా పురస్కారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గుమ్మడిదల మండలానికి చెందిన మైత్రి ఫౌండేషన్ వారు ఆమెను ఘనంగా సన్మానించారు. ఫౌండేషన్ చైర్మన్ చెన్నం శెట్టి ఉదయ్ కుమార్ శాలువా కప్పి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకొని గుమ్మడిదల పేరు మరింత ప్రతిష్ఠ పెంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నవీన్ సాగర్,మణికంఠ,ఉదయ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

అమీన్పూర్ మండలం పటేల్ గూడలో కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాయర్ బోర్డ్ ఆధ్వర్యంలో మహిళా ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైత్రి ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. మహిళల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాయర్ బోర్డ్ మేనేజర్ టన్సీబ్, ప్రోగ్రాం మేనేజర్ ప్రసాద్, ట్రైనర్ మీనా, ఏపిఎం రవిశంకర్ మరియు పటేల్ గూడ మహిళలు పాల్గొన్నారు.

జగిత్యాల లో గుట్కా అక్రమ నిల్వ ,సరఫరా పై సీసీఎస్ పోలీసుల ఉక్కుపాదం

ఒకరి అరెస్ట్ , 65,000/- నిషేదిత గుట్కా స్వాధీనం …

ఎస్పీ సింధు శర్మ ఆదేశాలతో గుట్కా పై ప్రత్యేక నిఘా, దాడులు …

వివరాలు వెల్లడించిన సీసీఎస్ సిఐ కిరణ్ …

రూరల్ మండలంలోని సంగంపల్లి,తిప్పన్నపేట కేంద్రంగా గుట్కా నిల్వ చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాలకు , షాపులకు అక్రమంగా సరఫరా చేస్తున్న *పల్లెర్ల జలేందర్* అనే వ్యక్తిని పట్టుకొని ,అతని వద్ద నుండి 65,000/- విలువగల గుట్కా స్వాధీనం చేసుకొని రూరల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు …

ఎస్పీ సింధు శర్మ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా గుట్కా అక్రమ నిల్వ ,రవాణా ,సరఫరా మరియు అమ్మకాలపై పూర్తిగా నిఘా ఉంచడం జరిగిందని , గుట్కా వ్యాపారం చేస్తున్న వారి వివరాలు సేకరించడం జరిగిందని త్వరలోనే వారిపై దాడులు చేసి ,గుట్కా అరికట్టడానికి పూర్తి చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు …

ఈ కార్యక్రమంలో సీసీఎస్ సిఐ కిరణ్,ఎస్సై రవీందర్ ,హెడ్ కానిస్టేబుల్ నర్సింగరావు, కానిస్టేబుల్ సత్యనారాయణ పాల్గొన్నారు …

అనంచిన్ని..
కారుపై దాడి చంపటమే లక్షమా.?

అనంచిన్ని..
కారుపై దాడి

★ కాపాడిన జర్నలిస్టుల సమావేశం

★ తప్పిన పెను ప్రమాదం

★ చంపటమే లక్షయమా.?

హైదరాబాద్ (నవ యువ తెలంగాణ)

తెలుగు ప్రజలకు పరిచయం అవసరంలేని జర్నలిస్ట్, పరిశోధన పాత్రికేయంలో తనదైన ముద్ర, కుంభకోణాలు రాయటంలో ఆరితేరిన యోధుడు, డబ్బు ప్రలోభానికి లోను కాడు, అహంకారం ఉండదు, ఆహార్యం మారదు, మొఖంలో చిరునవ్వు చెరగదు, బెదిరింపులకు భయపడడు, రాసిన రాతలకు జైళ్ళ నోళ్ళు తెరిస్తే ఆనందంగా వందల పుస్తకాలతో జైళ్ళకు వెళతాడు. స్వాతంత్ర్య పోరాటం తర్వాత పరిశోధన వార్తల కారణంగానే అత్యధిక రోజులు జైళ్ళలో గడపిన అద్భుతమైన చెరగని చరిత్ర. కనీసం ఒక్కరోజు కూడా జైళ్ళో జైలు కూడు తినని పట్టుదల, భౌతిక దాడులు కొత్త కాదు, మరణానికి వెరవని ధైర్యం ఆయన సొంతం. నిఖార్సయిన వార్తలకు ఆయన కేరాఫ్ అడ్రస్ వెరసి ఆయన పేరు అనంచిన్ని వెంకటేశ్వరరావు.

అసలేం జరిగింది.?

గత కొన్ని రోజులుగా అనంచిన్ని వెంకటేశ్వరరావు ‘ప్రీ లాంచ్’ ఎలాంటి అనుమతులు లేకుండా వేలాది ఠోట్లు కొల్లగొట్టిన “రియల్ ఎస్టేట్ ఫేక్” సంస్థలపై వరుస పరిశోధన కథనాలను అందిస్తున్నారు. బెదిరింపులు సహజం. అయితే బెదిరింపులకు భయపడక పోవడంతో కాళ్ళ బేరానికి ఒకరిద్దరు వచ్చారు. ఈ ముసుగులో ఏకంగా ఆయనపై హత్యాయత్నం జరిగింది. అయితే అది ఎవరు చేసిందనేది ఇంకా నిర్థారణ కాలేదు.

కారుపై దాడి..

అనంచిన్ని వెంకటేశ్వరరావుకు చెందిన వాహనంపై దాడి జరిగింది. అయితే ఆ సమయంలో ఆ వాహనంలో ఎవరూ లేకపోవడంతో కారు అద్దాలు పగలటం మినహా ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ఈ సమయంలో అనంచిన్ని, ఆయన మిత్రులు ‘సేఫ్’ అయ్యారు.

ఇది రెండోసారి..

అనంచిన్ని వెంకటేశ్వరరావుపై దాడి జరగడం ఇది రెండోసారి. ఒకసారి బషీర్ బాక్ ప్రెస్ క్లబ్ వద్ద 2004లో జరిగింది. కేసు ఫైల్ అయింది. నిందితులు ఇప్పటిదాకా దొరకలేదు. ఇటీవల కాలంలో దాడులు తగ్గించి కేసుల లింక్ మొదలెట్టారు. దానికి కూడా అనంచిన్ని వ్యూహాత్మకంగా ‘చెక్’ పెట్టారు. భవిష్యత్తులో ఆ,యా వ్యక్తులు, అధికారులు ‘వందల కోట్లకు ‘డిప్రమేషన్’ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు ఆఫీస్ అసిస్టెంట్ శ్రీకాంత్ తెలిపారు.

సేప్టీ కోసం మరో రెండు కార్లు..

ఇదిలా ఉండగా అనంచిన్ని వెంకటేశ్వరరావుకు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పట్టింపు లేదు. ఉండదు. అందుకే ఆయన భద్రత విషయంలో ‘అనంచిన్ని బ్రాడ్ కాస్టింగ్’ ఏకంగా కొత్తగా విడుదలైన రెండు కార్లను బుక్ చేసింది. ఈ కార్ల ప్రత్యేకత ఏమిటంటే 360 డిగ్రీల కెమెరా నిఘా ఉంటుంది.

మరో వారంలో కొత్త కారు ఇస్తాం..
‘అనంచిన్ని బ్రాడ్ కాస్టింగ్’ సంస్థ తరఫున రెండు కార్లు బుక్ చేసిన మాట యథార్థమని, ఈ అత్యాధునిక కారు కోసం ఏడాదిన్నరద వేచి చూడాలని అయితే పరిస్థితి అంచనాలోకి తీసుకొని మరో వారంలోనే కొత్త కారు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు, తమ కస్టమర్ల విషయంలో తాము పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటామని, కస్టమర్ల కోసం తాము కట్టుబడి ఉంటామని ప్రముఖ కంపెనీ మహేంద్ర బాద్యులు, ప్రముఖ వ్యాపారవేత్త వివిసి రాజు స్పష్టం చేశారు.

తీవ్రంగా ఖండించిన టిజెఎస్ఎస్..

ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావును బెదిరించన ఆడియో ఒకవైపు హల్చల్ చేస్తుండగా దాడి జరగటం పై తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.

లేడీ కానిస్టేబుల్ కోసం గొడవ పడ్డ సిఐ, కానిస్టేబుల్….!!!

నవ యువ తెలంగాణ:పోలీసు శాఖలో క్రమశిక్షణకు ప్రాధాన్యత వుంటుంది. ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ విధులు నిర్వహించాలి. తోటి పోలీసులతో వివాదాలకు పోతే అసలుకే ఎసరు వస్తుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో లేడీ కానిస్టేబుల్ విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారింది. భీమవరంలో ఇద్దరు పోలీసుల తీరు తీవ్ర వివాస్పదమవుతుంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుండటంతో డిపార్ట్మెంట్ పరువు పోతోంది. తాజాగా భీమవరం వన్ టౌన్ స్టేషన్లో సిఐకి కానిస్టేబుల్ కి మధ్య చెలరేగిన వివాదం ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాజాగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

భీమవరం వన్ టౌన్ సిఐ కృష్ణభగవాన్ స్టేషన్లో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు అక్కడ వారిని అకారణంగా వేధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా రాజేష్ అనే కానిస్టేబుల్ స్టేషన్లోని మరో లేడీ కానిస్టేబుల్ కు బైక్ పై లిఫ్ట్ ఇస్తున్నాడనే కారణంతో అతన్ని వేధించడం మొదలు పెట్టాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయంలో కానిస్టేబుల్ రాజేష్ కు మధ్య ఘర్షణ సైతం చోటు చేసుకుంది. ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

విచారణ అనంతరం సీఐ కృష్ణ భగవాన్ ను వెకెన్సీ రిజర్వ్ కు పంపించడంతో పాటు కానిస్టేబుల్ ను భీమవరం నుంచి మొగల్తూరు స్టేషన్ కు బదిలీ చేసారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు చిన్నచిన్న విషయాలపై ఎక్కువ శ్రద్ధపెడుతూ ఒకరినొకరు కొట్టుకునే స్థితికి రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెండ్లీ పోలిసింగ్ తో నేరాలు అదుపు చేయాల్సిన పోలీసుల మధ్య సఖ్యత ఉండట్లేదనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది.